Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహాభారతం' ప్రాజెక్టును పక్కన పెట్టేసిన ఆమిర్ ఖాన్

  • 'మహాభారతం' గురించి ప్రస్తావించిన ఆమిర్ ఖాన్
  • కృష్ణుడు .. కర్ణుడు పాత్రల పట్ల ఆసక్తి
  • ఆలోచన విరమించుకున్న ఆమిర్      
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో, పురాణాలు, చరిత్రకి సంబంధించిన భారీ సినిమాలను తెరకెక్కించడానికి అగ్ర దర్శక నిర్మాతలు .. హీరోలు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తాను 'మహాభారతం' సినిమాను 5 భాగాలుగా అందించాలనుకుంటున్నట్టుగా ఆ మధ్య ఆమిర్ ఖాన్ చెప్పారు. ప్రతిభాగం భారీ బడ్జెట్ తో రూపొందుతుందని అన్నారు.

ఈ సినిమాలో తాను శ్రీకృష్ణుడిగా గానీ .. కర్ణుడిగా గాని నటిస్తానని చెప్పారు. అయితే ముస్లిం అయిన ఆయన ఈ సినిమాలో నటించడమేంటంటూ కొంతమంది తీవ్రమైన విమర్శలు చేశారు. దాంతో ఆమిర్ ఖాన్ ఆలోచనలో పడ్డాడట. అంతేకాదు .. ఇటీవల విడుదలైన కొన్ని చారిత్రక చిత్రాలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నది చూసిన తరువాత ఆయన 'మహాభారతం' ఆలోచనను దాదాపు విరమించుకున్నట్టు చెబుతున్నారు. ఇలాంటి చిత్రాల జోలికి వెళ్లి అనవసరమైన వివాదాలను తెచ్చుకోవడం ఎందుకనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.    
Aamir Khan

More Telugu News